పచ్చిమిరప లోని 'కాప్సైసిన్/capsaicin's అనే మూల రసాయనక పదార్థము నరాల (nerves) మీద ఉండే TRPV1/VR1 అనే ప్రోటీవ్-అణు(ion-channels)కణజాలం పై పనిచేయుట ద్వారా నొప్పిని తట్టుకునే/తగ్గించే (Pain Killer) గుణం కలిగి ఉంది. కారం లోని మంట (fire) కలిగించే గుణం వల్ల నరాలపై ఒత్తిడి కొంచెం పెరిగినా (neuronal firing) హీట్-పెయిన్ ను తట్టుకునే క్షమతను ద్విగుణీకృతం చేస్తుంది (ఉష్ణః ఉష్ణో శీతలః అన్నట్లు)
చాలా పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్/జెల్స్ లో పచ్చిమిరప లోని 'కాప్సైసిన్/capsaicin ఒక ప్రధాన మూలకం. కాప్సైసిన్/capsaicin పనిచేసే TRPV1/VR1 అనే ప్రోటీవ్-అణు(ion-channel nerve innervations లో) కణజాలం లో కనుగొన్న 'డేవిడ్ జూలియస్' అనే అమెరికన్ శాస్త్రవేత్త కు పరిశోధనలకు గాను 2021నోబుల్ పురస్కారం కూడ వచ్చింది. (దీని గురించి ఆంగ్ల కోరా లో కూడ వ్రాశాను).
అయితే, దీని గురించి మన పూర్వీకులకు తెలుసనే చెప్పాలి - ఎందుకంటే చిన్నప్పుడు పరుగెత్తుతూ క్రిందపడి చర్మం దేక్కుపోయి విపరీతంగా నొప్పి-మంట తో బాధ పడుతుంటే అందరు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేయించాలి అనుకుంటుంటే, మా అమ్మమ్మ మాత్రం ఏమక్కర్లేదు వీడు కొంచెం ఓర్చుకోగలిగితే గాజు గుడ్డలపొరల మీద కారం-పేరునెయ్యి వేసి కట్టుకడితే నెప్పి-మంటని ఇట్టే తీసేస్తుందని చెపితే, నాకు ఉన్న నొప్పి తగ్గితే చాలని ఒప్పుకున్నా. మా అమ్మమ్మగారు చెప్పినట్లే 5 నిమిషాలలో నొప్పి-మంట మటుమాయమైపోయాయి. దీనినే న్యూరోసైన్సులో నెర్వ్ డీసెన్సిటైజేషన్ ఫినామినన్ అంటారు.
కావున, నేరుగా పౌరుషాన్ని పెంచక పోయిన, పచ్చిమిరప్పళ్ళ/ఎండుమిరప కారం వల్ల నొప్పిని/బాధని తట్టుకోగల క్షమత పెరుగుట ద్వారా పరోక్షంగా "పోరాట పటిమను" శారీరక శ్రమను తట్టుకునే క్షమతను పెంచుతుంది. అందుకనే, కాయకష్టం చేసేవారు తెలియకపోయినా గొడ్డుకారం తినటం ద్వారా వారు చేసే కఠోర శ్రమ ద్వారా కలిగే నొప్పిని/బాధని తట్టుకోగల శక్తి వస్తుంది.
ఇక కారం ఎక్కువ గా తినటం వలన ఎసిడిటి (ఆమ్లకరం) - అల్సర్ లు (కడుపులో పుండు) ఎక్కువవుతాయి అన్నది కూడ శాస్త్ర పరంగా నిరూపితమవలేదు. అయితే పచ్చి/ఎండు మిరప కారం తో పాటు పేరునెయ్యి తినమని చెప్పేది ఎందుకంటే - కారం మంట ను తగ్గించటం తో పాటు, ఈ కాప్సైసిన్/capsaicin's మూలకం తేలికగా కరిగి శరీరం లోకి తేలికగా వంటపడుతుంది (absorb అవుతుంది). అందుకే, గుంటూరు గొడ్డుకారం తో పాటు నెయ్యి/నేతి వ్యాపారానికి కూడ పేరెన్నికగొన్నది.
ఈ 'కాప్సైసిన్/capsaicin' కి ఉన్న మరొక ముఖ్య గుణమేమంటే శరీరాన్ని / ఒంటిని చల్లపరుస్తుంది - ఉష్ణః ఉష్ణో శీతలః అను గుణం పట్టి.
ప్రకృతినిసర్గపు ఒక విశేషమేమంటే ఎండలు ఎక్కువగా ఉండే (ట్రాపికల్ వాతావరణం) ప్రాంతాలలోనే కారపు గాఢత ఎక్కువ ఉండే మిరప పంట ఎక్కువ పండుతుంది. మన దేశంలోనే చూసుకుంటే ఎండలు మండిపోయే తెలుగు రాష్ట్రాలలోను (గుంటూరు -పల్నాడు & వరంగల్లు/ఓరుగల్లు/వీరులగల్లు) మరియు రాజస్థాను లలో మిరప పంటకు పేరుగాంచాయి.
కావున, కారం తినటం వల్ల నొప్పి/బాధని తట్టుకునే వాటం పెరగటం ద్వారా పోరాట పటిమ/క్షమత పెరుగుతుందనే చెప్పాలి. అయితే, మన దేశంలో తెలుగు వారే కాక చాలా రాష్ట్రాల వారు కారం ఎక్కవ గానే తింటారు. అయితే మన తెలుగు రాష్ట్రలలో పల్నాడు-రాయలసీమలు, ఓరుగల్లు వీరులగడ్డ పురాతన కాలం నుండే పౌరుషాల పోరాటాలకు పురిటిగడ్డలే కదా.



