HEALTH MANTRAH

మగవాళ్ళు కామవాంఛను ఎలా తగ్గించుకోవాలి | How men should reduce sexual desire

AYUSH MANTRAH
0
Also Read

మగవాళ్ళు కామవాంఛను ఎలా తగ్గించుకోవాలి | How men should reduce sexual desire
sexual desire

మగవాళ్ళు కామవాంఛను ఎలా తగ్గించుకోవాలి | How men should reduce sexual desire

ప్రేమ, అతి కామానికి ముందు లాగా పనిచేస్తుంది. మన కుటుంబాన్ని, అక్క, చెల్లె, స్నేహితురాళ్ళ ని ఒకే విధంగా ప్రేమించటం నేర్చుకోండి. వాళ్లతో సవ్యమైన అనుబంధాన్ని పెంచుకోండి. అందరితో అనుబంధంగా, బిజీగా ఉన్నప్పుడు కామo పలుచనై పోతుంది, కామంతో ప్రేరేపించబడి ఎవరిని దూరం చేసుకోలేరు.

అమ్మతో ఎక్కువ గడపండి, వీలైతే బయటకి వెళ్లేప్పుడు కూడా అమ్మనో, చెల్లినో, అక్కనో తీసుకొని వెళ్ళండి. దృష్టి చెదరదు, ఒకవేళ చెదిరితే ఏమాత్రం వెనకాడకుండా మానసిక వైద్య నిపుణుల్ని కలసి సమస్య పరిష్కరించుకోండి.

ఒకప్పుడు కాలేజీ రోజుల్లో (నా ) చెల్లెళ్ళు కుటుంబ పరువు పోతుందని అన్నలకు ఈ విషయంలో కళ్ళాలు వేసి ఆపగలిగే వారు. ఇప్పుడు ఇద్దరూ అదే దారి పట్టి ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించు కుంటున్నారు.

విసుగు ఎందుకు ?ఆకలి వేసినప్పుడు మన సొంత సంపాదనతో తినాలి, అలాగే సామర్థ్యం వచ్చినప్పుడు సవ్యంగా కామాన్ని గూడా ఆస్వాదించాలి. శారీరక అనుబంధం లేకపోతే పెండ్లికి కుటుంబానికి నిర్వచనాలు మారిపోతాయి, కష్టం అవుతాయి. ప్రపంచం అంతా ఇలాగే పెరుగుతోంది కదా! జీవితాంతం ఉండే తోడుని కచ్చితంగా వెతుక్కోవాలి ఏ జీవైన.

ముఖ్య సూచనలు:
  • మీకు పెళ్ళైతే జీవిత భాగస్వామి ద్వారా తీర్చుకోండి.పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిన వారైతే భాగస్వామి మోనోపాజ్దశ దాటి సరిగా సహకరించకపోతే ఆమె సహకారంతోనే అంగప్రవేశంతో మాత్రమేకాక హస్తప్రయోగం లాంటి ఇతర పద్దతుల ద్వారా కోరిక తీర్చుకోవడం అలవాటు చేసుకోండి. ఇది సురక్షితమైనది.
  • పెళ్ళి వయస్సు వచ్చినవారైతే పెళ్ళిచేసుకోండి.
  • పిన్నవయస్కులైతే భావిజీవితానికి అవసరమైన విషయాలపై దృష్టి మరల్చుకోండి.తప్పని సరి పరిస్థితుల్లో హస్తప్రయోగం తో తృప్తిపడండి. అక్రమ లైంగిక సంబంధాల కంటే హస్తప్రయోగమే సురక్షితం.
By: Nagababu Pattem

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top