HEALTH MANTRAH

ప్రతి రోజు పచ్చి వెల్లుల్లి తినడం మంచిదేనా - Is it good to eat raw garlic every day

AYUSH MANTRAH
0
Also Read

ప్రతి రోజు పచ్చి వెల్లుల్లి తినడం మంచిదేనా - Is it good to eat raw garlic every day
Garlic
అందరి ఇళ్ళల్లో లభించే వెల్లుల్లి 14 రకాల క్యాన్సర్ మరియు మరెన్నో రకాల ఇతర జబ్బులు రాకుండా చేస్తుందని చెపుతున్నారు. క్యాన్సర్ పేషెంట్స్ రోజుకి కనీసం 5 - 6 దంచిన పచ్చి వెల్లుల్లి రెమ్మలను తినటం మంచిది. ఈ రేమ్మలని వెంటనే తినకుండా ఓ 15 నిమిషాలు ఆగాలి. ఈ 15 నిమిషాలలో వెల్లుల్లి రెమ్మల నుంచి allinase అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇందులో యాంటి ఫంగల్ మరియు యాంటి క్యాన్సర్ తత్వాలు ఉంటాయి.

తరచుగా వెల్లుల్లి తింటే దాదాపు 166 రకాల జబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధకులు అంటున్నారు.

బాగ్నస్తి సంధనకరో రాసోనాహా: (ఎల్లిపాయ )

  • వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు, వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయి.
  • వెల్లుల్లి 2,3 పాయలను తొక్కుతీసి అరకప్పు పాలలో కాచి రాత్రి రోజు తాగినా కీళ్ల వాపులు, కీళ్లనొప్పులు తగ్గుతాయి.
  • వెల్లుల్లి రసం: ఇందులో ఉండే అల్లిసిన్ మూలకం కొలెస్ట్రాల్ మరియు బీపీని తగ్గిస్తుంది.
  • దాంతో హార్ట్ బ్లాక్‌ ఓపెన్ అవుతుంది..
  • పచ్చి వెల్లుల్లి రెబ్బ తినడం ద్వారా తీవ్రమైన జలుబు, ఇతర సమస్యలతో బాధపడేటప్పుడు త్వరగా నయం అవుతుందని.

వ్యాధినిరోధక శక్తి పెరగడానికి

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ వ్యాధినిరోధక శక్తి మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే పరకడుపున ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ తింటే.. చాలా త్వరగా, తేలికగా వ్యాధినిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుంది.

అధిక రక్తపోటు :

అధిక రక్తపోటు తో బాధపడేవాళ్లకు వెల్లుల్లి అద్భుతంగా సహాయపడుతుంది. ఉదయాన్నే పరకడుపున ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల రక్తపోటుని తగ్గించడానికి సహాయపడుతుంది.

జలుబు నివారించడానికి

వెల్లుల్లి వ్యాధినిరోధక శక్తి ని పెంచడం ద్వారా శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది. వెల్లుల్లిని ఉదయం పరకడుపున తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్స్ దూరంగా ఉంటాయి.

గుండె వ్యాధుల ప్రమాదం

వెల్లుల్లి చెడు కొవ్వు నిల్వలని అదుపు చేయడానికి సహాయపడుతుంది. అలాగే మంచి కొవ్వు నిల్వలని అదుపులో ఉంచేలా చేస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గించడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ అరికట్టడానికి

పచ్చి వెల్లుల్లి రెబ్బని ఉదయాన్నే పరకడుపున తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ల రిస్క్ ని తగ్గించవచ్చు. పొట్ట, యూటెరైన్, ప్రొస్టేట్ వంటి క్యాన్సర్లను దూరంగా ఉంచుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ క్యాన్సర్ సెల్స్ ని నాశనం చేస్తుంది.

శరీరాన్ని డెటాక్స్ చేస్తుంది

వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో హానికారక మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఉదయాన్నే పరకడుపున వెల్లుల్లి రెబ్బ తింటే శరీరం డెటాక్సిఫై అవుతుంది.

డిమెంటియా

వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కణాలను డ్యామేజ్ చేయడాన్ని అరికడుతుంది. దీంతో వయసు పెరిగే కొద్దీ వచ్చే డిమెంటియా సమస్యను అడ్డుకోవచ్చు. కాబట్టి ఉదయాన్నే ఒక వెల్లుల్లి రెబ్బను క్రమం తప్పకుండా తినండి.

ఎముకల ఆరోగ్యం

వెల్లుల్లి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే పరకడుపున వెల్లుల్లి తింటే.. శరీరంలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ ని పెంచుతుంది. దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
  • శరీరములో కఫముని పొగొట్టును.
  • శ్లేష్మంని పొగొట్టును.
  • వాతము , బాలింతలకు వచ్చే సూతికా రోగము , టైఫాయిడ్ జ్వరం పొగొట్టును.
  • దేహము అంతా చల్లబడే మహావాతం ను పొగొట్టును.
  • పాతకాలం నుంచి ఉండు జ్వరం పొగొట్టును.
  • వాతనొప్పులు , కీళ్లనొప్పులు , పక్షవాతం ని నిర్మూలించును.
  • ఊపిరి తీసుకుంటున్నప్పుడు వచ్చే ఊపిరిగొట్టు నొప్పి పొగొట్టును.
  • అజీర్ణం , అజీర్ణం వలన వచ్చే కడుపునొప్పి పొగొట్టును.
  • శరీరం యొక్క ఉబ్బుని నిర్మూలించును.
  • కడుపులో ఏర్పడే బల్లలు నివారించును.
  • గుల్మము , మూలవ్యాధి , కుష్టు , క్షయ ని నివారించును.
  • నోటికి రుచి లేకపోవటం , హుద్రోగము , ఆస్తమా , తలనరములకు సంబంధించిన రోగములు నివారించబడును.
  • బ్రాంకైటిస్ , ఒంటినొప్పులు నివారించబడును.
  • దేహము పచ్చబరుచునట్టి జ్వరముని నివారించబడును.
  • విరిగిన ఎముకలను అతుక్కోనున్నట్టు చేయును .
  • మూత్రము , చెమటని శుభ్రపరచును.
  • కంఠస్వరం ని బాగుగా చేయును .
  • చేతులు , కాళ్లు వణికే రోగమును పొగొట్టును .
ఈ అంశాలన్నీ వైద్యానికి సంబంధించిన పుస్తకాలలో సేకరించినవి మరియు పెద్దలు చెప్పిన మాటలన్నీ క్రోడీకరించి రాయడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించిన ఇంతవరకు నిపుణులు సలహాలని పాటించవలసి ఉంటుంది.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top