![]() |
| Dates |
సహజంగా ఖర్జూరం మనకు రెండు రూపాల్లో లభిస్తుంది ఒకటి పండు ఖర్జూరం, రెండు ఎండు ఖర్జూరం.
- పండు ఖర్జూరం లో మరి పోషకాల విషయం లో 144 కేలరీల శక్తి ఉంటుంది. ఎండు ఖర్జూరంలో 317 కేలరీల శక్తి ఉంటుంది. పండు ఖర్జూరం లో ఒక్క మిల్లీగ్రామ్ ఐరన్ ఉంటుంది.
- ఎండు ఖర్జూరం లో ఐరన్ ఏడు మిల్లీగ్రాములు ఉంటుంది. ఖర్జూరంలో కాల్షియం కూడా అధిక మోతాదులో లభిస్తుంది.
- సహజంగానే ఖర్జూర పండును నేరుగా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తప్పనిసరిగా నాన పెట్టాల్సిన అవసరం లేదు.షుగర్ పేషెంట్స్ పండు ఖర్జూరాలను తినకూడదు. కానీ ఎండు ఖర్జూరాలు తినవచ్చు.సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజుకు 5 నుండి 6 కర్జూరాలు తినవచ్చు.
- ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఖర్జూర పండ్లు లభిస్తుంటాయి.అయితే ఏ రకానికి చెందిన ఖర్జూర పండ్లు అయిన తినవచ్చు ఒకే ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి.
- మనకు లభించే ఖర్జూర పండ్ల లో ఖర్జూరపు తొక్క పైకి లేచి ఉంటుంది. దీన్ని బెల్లం పాకం లో ఉంచుతారు అని అపోహ ఉంది.
- ఖర్జూర పండ్లను నిల్వ ఉంచేటప్పుడు శీతల కేంద్రాలలో నిల్వ ఉంచడం వల్ల పండు మీద కొద్దిగా జిగురు తయారై ఉంటుంది అంతే కానీ బెల్లం పాకంలో ఉంచరు.ఎండు ఖర్జూరాలు పొడిచేసుకుని నిల్వ ఉంచుకుంటే పురుగు పట్టదు.
- ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది.ఈ పొడిని నీళ్లలో కలిపి తీసుకుంటే ఐరన్ శాతం పెరిగి రక్తవృద్ధి జరుగుతుంది.
- రక్తం లీటర్ల లో పెరుగుతుంది. జలుబు, దగ్గు, శ్లేష్మము మరియు కఫము వంటివి తొలగిపోతాయి.పంచదార, బెల్లం వాడకం ఆపివేసి ఖర్జూరాన్ని ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా మంచిది.



