![]() |
| Yoga |
యోగ - పరిచయము
యోగ అనునది ఒక అధ్యాత్మిక (క్రమశిక్షణ, శరీరం, మనసుల మధ్య అనుసంధానం ఏర్పరచే ఒక మహత్తర అదృశ్య వైజ్ఞానిక శాస్త్రం. ఉన్నత జీవన విధాన శైలి. యోగ అను పదం సంస్కృత మూలపదమైన “యుజ్” నుండి ఉధృవించింది. "యుజ్" అంటే కలవడం, ఐక్యం కావడం, సమ్మళితం కావదం. యోగ ఆనునది మన చేతనావస్థను నిత్య చేతనావస్థతో కలవడానికి దోహదపడుతుంది. యోగ మన జీవన ప్రయాణం లోని ప్రతి సందర్భాన్ని ప్రభావితం చేస్తూ, అడ్డంకులను అధిగమించేలా చేస్తూ, ఆరోగ్య, ఆనందాలను కలగజేస్తూ ముందుకు తీసుకుపోతుంది.
యోగ ఆవర్భావము | Origin of Yoga
యోగ ఇప్పటికిప్పుడు పుట్టినదేమీ కాదు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన భారతదేశ మహనీయులు, మహర్షులు ఎంతో మంది ఆచరించారు. అంతే కాకుండా ప్రపంచ నలుమూలలో కూడా యోగ వెలుగులు ఉన్నాయని మనకు చరిత్ర, ప్రాచీన నాగరికతలు తెలియజేస్తున్నాయి. భారతదేశంలో యోగవిధానముల అభివృద్ధి పరిపూర్ణస్థితికి చేరు కోబడ్డాయి. అగస్య మహాముని యోగను భరతఖండం అంతటా విస్తరింపజేశారు. పతంజలి మహర్షి నేటి సమజానికి పతంజలి యోగ సూత్రాల రూపంలో క్రోడీకరించి అందించారు. ఇక చారిత్రక ఆధారాలకు వస్తే 5వ శతాబ్దానికి ముందు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం ప్రాంతంలో మౌనమూర్తి చిత్రలేఖనాలు బొమ్మల రూపంలో యోగను ఆచరించిన ఆనవాలు కనబడ్డాయి.
![]() |
| రుద్రుడు ప్రజాపతి, యోగ తంత్ర విధాన రూపంలో ఉన్న అమ్మతల్లి బొమ్మలు |
యోగా చరిత్ర | Yoga History
క్రీస్తుపూర్వం 3700 సంవత్సరం ముందు వెలసిన సింధూ నాగరికతలో ఎన్నో ముద్రికలు బొమ్మలు, టెర్రకోట ప్రతిమలు, యోగాసన రూపంలో బయటపడ్డాయి. కందాసనంలో ఉన్నరుద్రుడు ప్రజాపతి, యోగ తంత్ర విధాన రూపంలో ఉన్న అమ్మతల్లి బొమ్మలు కనిపించాయి. వేదాలలో ఉపనిషత్తులలో జైన, బౌద్ధ సంప్రదాయాలలో పంచమ వేదాలైన రామాయణ, మహాభారతాలలో శక్తిమతం, శైవమతం, వైష్ణవమతం లాంటి ఎన్నో ప్రాచీన సాంప్రదాయాలలో యోగ కనిపిస్తుంది. ఎన్నో మరెన్నో యోగ విధానాలన్నిటిని ఒక చోటుకు చేర్చి మనిషి మెదడుకు హత్తుకుపోయేలా నాలుగు అధ్యాయాలలో మెదడు నాలుగు భాగాలకు అందేలా గొప్పగా పతంజలి యోగ సూత్రాల ద్వారా మనకందించారు.
మహర్షి పతంజలి తర్వాత అవే యోగసూత్రాలను మూలాధారంగా, విపులంగా తెలియజేస్తూ
భోజుడు “భోజరాజీయము" అను గ్రంధాన్ని అందించాడు. తర్వాత కాలంలో క్రియా యోగం మీద స్వామి స్వాత్మరామ అందించిన “హఠ యోగ ప్రదీపిక" ఘరెండ సంహిత, శివసంహితలు విలువ కట్టలేని వజ్రాలు, వీటి ఆధారంగా ఇప్పుడు మనకు ఎంతో మంది మహనీయులు ఇంకా సులభంగా యోగ విజ్ఞానాన్ని అందిస్తున్నారు. అందరికి యోగ... యోగ అంటే కేవలం ఆసనాలు వేయడం అనునది ప్రస్తుతం ఉన్న పెద్ద అపోహ, చిత్ర విచిత్ర భంగిమలతో కాళ్లు, చేతులు నదుము వంచలేమని చాలా మంది భయపడుతున్నారు. అలాంటి విధానాలు ఎంతమాత్రం అవసరం లేదు. ఏడు సంవత్సరాల వయసు నుండి 100 సంవత్సరాల వయసు వారు ఎవరైనా యోగను
ఆచరించవచ్చు. రాజయోగ, జ్ఞానయోగ, భక్తియోగ, కర్మయోగ విధానాలలో సులువుగా ఆచరించగలిగే యోగ విధానాలున్నాయి. అంతే కాకుండా హఠ యోగ, కండ లినీ యోగ, మంత్రయోగ, లయ యోగా లాంటి వైవిధ్య యోగా విధానాలున్నాయి. అందరూ ఆచరించగలిగే విధానాలు పతంజలి యోగ సూత్రాలలో అష్టాంగ యోగ మార్గం ద్వారా తెలియజేశారు. ఈ విధానాలు ఎంతో మంది మహనీయులు ఆచరించి చూపారు.




