HEALTH MANTRAH

ఈ సమయంలో రతిలో పాల్గొనకూడదు | Do not have sex during this time

AYUSH MANTRAH
0
Also Read

ఈ  సమయంలో రతిలో పాల్గొనకూడదు | Do not have sex during this time
sex


మనుషులు సంభోగంలో పాల్గొనడానికి సమయ సందర్భాలు ఉంటాయి. కాదు కూడదని ఎప్పుడు పడితే అప్పుడు సెక్స్ లో పాల్గొంటే మాత్రం ప్రాణాల మీదికి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సెక్స్ లో పాల్గొనడానికి ఒక సమయం అంటూ ఉంటుంది అంటే నవ్వుతారేమో. కానీ ఇదే నిజమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రాత్రిపూట మందుకొట్టిన తర్వాత  సెక్స్ లో అస్సలు పాల్గొనకూడదట. ఏమీ కాదని రెండు తనువులు కలిస్తే మాత్రం ప్రాణాల మీదికే వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కడుపు నిండా తిని లేదా మద్యం సేవించి శృంగారంలో పాల్గొంటే గుండెపోటు వచ్చే ప్రమాదం క్రమంగా పెరుగుతుంది. ఇది కాస్త మరణానికి దారితీస్తుంది.

sex
ప్రతి ఒక్కరికీ సెక్స్ గురించి ఎన్నో రకాల ఫాంటసీలు ఉంటాయి. ఇక కొంతమంది నచ్చిన పొజీషన్ లో సెక్స్ లో పాల్గొనాలనుకుంటారు. ఏదేమైనా సెక్స్ గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఇక ఈ సెక్స్ పై ఒక్కొక్కరికీ ఒక్కో భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. ఏదేమైనా సెక్స్ భార్యా భర్తలకు లాభాదాయకమనే చెప్పాలి. దీనివల్ల గుండెపోటు నుంచి బరువు తగ్గడం, స్ట్రెస్ తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా వారినికి రెండు మూడు సార్లు సెక్స్ లో పాల్గొంటే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కానీ ఏ సమయంలో పడితే  ఆసమయంలో సెక్స్ లో పాల్గొనడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సెక్స్ శారీరక తృప్తిని మాత్రమే కాదు.. ఎన్నో రోగాలను నయం చేసే దివ్య ఔషదం కూడా. వైవాహిక బంధం బలంగా ఉండాలంటే సెక్స్ చాలా అవసరం. ఒక్క సెక్స్ యే కాదు మానసికంగా బలంగా ఉంటేనే భార్యా భర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది. ఆరోగ్యంగా  ఉండాలనుకుంటే ఆల్కహాల్ తాగి సెక్స్ లో పాల్గొనకపోవడమే ఉత్తమమని  నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నైట్ టైం కంటే ఉదయం పూటే ఎక్కువ సేపు సెక్స్ ను ఆస్వాదిస్తారట. ముఖ్యంగా ఎలాంటి శారీరక సమస్యలు కూడా రావు. అయితే కోరికలు రేకెత్తించడానికి చాక్లెట్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. చాక్లెట్ తినడం వల్ల సెరోటోనిన్ విడుదల అవుతుంది. ఇది లోపలి నుంచి మీ మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. అందుకే సెక్స్ కు ముందు చాక్లెట్ తినాలని నిపుణులు సలహానిస్తుంటారు. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top