HEALTH MANTRAH

చిన్న వయసులో అధిక కొలస్ట్రాల్‌ | Risk of high cholesterol at a young age

AYUSH MANTRAH
0
Also Read

చిన్న వయసులో అధిక కొలస్ట్రాల్‌ | Risk of high cholesterol at a young age
Risk of high cholesterol at a young age

చిన్న వయసులో అధిక కొలస్ట్రాల్‌ ప్రమాదం.. ఈ లక్షణాలు విస్మరించవద్దు !

చెడు కొలస్ట్రాల్ ఆరోగ్యానికి పెద్ద శత్రువు. గతంలో ఈ సమస్యను మధ్య వయసువారు ఎదుర్కొనేవారు. దీనివల్ల అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ గత కొద్దికాలంగా చాలా మంది యువకులు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, హై బీపీ బారిన పడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. అందుకే శరీరంలో పెరుగుతున్న LDL లక్షణాలను గుర్తించడం ముఖ్యం. వీటిని విస్మరిస్తే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అధిక కొలెస్ట్రాల్ లక్షణాల గురించి తెలుసుకుందాం.
  1. చెమటలు పట్టడం వేసవి కాలంలో చెమటలు పట్టడం సహజం. అయితే సాధారణ గది ఉష్ణోగ్రత లేదా చలికాలంలో నుదుటిపై నుంచి చెమటలు పడుతుంటే ఆలోచించాల్సిన విషయం. వాస్తవానికి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తం గుండెకు చేరదు. దీని కారణంగా అనవసరమైన చెమట మొదలవుతుంది.
  2. శ్వాస ఆడకపోవడం మీ వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటే మీరు శారీరక శ్రమలు చేయడంలో ఇబ్బంది పడకూడదు. కానీ కొంతమంది యువకులు 2వ అంతస్తు వరకు కూడా మెట్లు ఎక్కలేరు. ఈ సమయంలో వారు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. హృదయ స్పందన చాలా వేగంగా మారుతుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ హెచ్చరిక అని చెప్పవచ్చు.
  3. కళ్ల చుట్టూ మచ్చలు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగినప్పుడు కళ్ల చుట్టూ ఉన్న చర్మం పసుపు రంగులోకి మారుతుంది. లేదా పసుపు దద్దుర్లు వస్తాయి. రక్తంలో అధిక కొవ్వు పెరుగుదల కారణంగా ఇది జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది.
  4. శరీర భాగాలలో నొప్పులు అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్త సిరల్లో అడ్డంకులు ఏర్పడతాయి. దీని కారణంగా శరీరంలోని అనేక భాగాలలో రక్త ప్రసరణ ప్రభావితమవుతుంది. ఈ పరిస్థితిలో మీరు కాళ్ళు, మెడ, చేతులు, దవడలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు.
  5. అధిక కొలెస్ట్రాల్‌ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు చాలా తీవ్రతరం అయినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. వీటిని నివారించడానికి మీరు క్రమమైన వ్యవధిలో లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి, దీనిలో రక్త నమూనా తీసుకుంటారు. ఇది కొవ్వు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా చూపుతుంది. ఈ విధంగా ప్రమాదం పెరగకముందే ఆపవచ్చు.

High cholesterol risk at a young age. Don't ignore these symptoms..

Bad cholesterol is a major enemy of health. Middle-aged people used to face this problem in the past. This is the reason for hypertension, obesity, diabetes, and heart disease. But in the last few days, many young people are suffering from heart attacks, brain strokes, and high BP. This is a matter of concern. That is why it is important to recognize the symptoms of LDL increasing in the body. Ignoring these is very dangerous. Let's know about the symptoms of high cholesterol.
  1. Sweating is normal to sweat in the summer. But something to think about is normal room temperature or forehead sweating in the winter. Actually, high cholesterol does not reach the heart. Unnecessary sweating begins because of this.
  2. not breathing if you are between 25 and 30 years of age you should not struggle to do physical labor. But some young men can't even climb the stairs to the 2nd floor. At this point, they can hardly breathe The heartbeat changes so fast. This could be called a high cholesterol warning.
  3. Scars around the eyes when the cholesterol is high the skin around the eyes turns yellow. Or the yellow flashes will come. This happens due to high cholesterol in the blood. This is very dangerous.
  4. Pain in body parts causes blockage in blood vessels due to high cholesterol. This affects blood circulation in many parts of the body. In this situation, you will experience severe pain in the legs, neck, arms, and jaw.
  5. High cholesterol symptoms only appear when very severe. To avoid these, you need to get a lipid profile exam on a regular basis, which includes a blood sample. This shows whether fat is more or less. This way the danger can be stopped before it escalates.

గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top