![]() |
| Breast cancer |
ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్.. కారణాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రకారం, బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 జన్యువులు మహిళల శరీరంలో ఉంటాయి. కొన్ని కారణాల వల్ల ఈ జన్యువులు సరిగ్గా పనిచేయడంలో విఫలమైనప్పుడు, ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 జన్యువులలో మ్యుటేషన్ కారణంగా దాదాపు 55 నుంచి 65 శాతం మంది మహిళలు ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇతర క్యాన్సర్ల కంటే ఇది దూకుడుగా ఉంటుంది. చికిత్స చేయించుకున్నా తిరిగి 3 ఏండ్ల తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి 5 ఏండ్లలో ప్రాణాంతకం అయ్యే అవకాశాలున్నాయి. ఇది ఇతర రకాలకు పనిచేసే కొన్ని మందులకు స్పందించదు.
![]() |
| రొమ్ము క్యాన్సర్..లక్షణాలు |
రొమ్ము క్యాన్సర్ లక్షణాలిలా ఉంటాయి?
- రొమ్ము చుట్టూ చర్మం గట్టిపడుతుంది.
- రొమ్ములో ముద్దలాంటి పదార్థం చేయికి తగులుతుంది.
- రొమ్ము చుట్టూ చర్మం రంగులో మార్పు కనిపిస్తుంది.
- చంకల ప్రాంతంలో గడ్డలు వస్తుంటాయి.
- చనుమొన నొప్పి వస్తుంది. రంగు మారుతుంది.
- చనుమొన లొపలికి తిరిగినట్లుగా ఉంటుంది.
- చనుమొన నుంచి ద్రవం కారుతుంది.
- రొమ్ము చుట్టూరు ఎరుపు రంగు కనిపిస్తుంది.
రొమ్ము క్యాన్సర్ రావడానికి గల కారణాలు:
- జన్యు సంబంధ కారకాల వల్ల ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 జన్యువులు సరిగా పనిచేయకపోవడం వల్ల
- మెనోపాజ్ ఆలస్యం కావడం వల్ల
- అధిక శరీరం బరువు ఉండటం వల్ల
- రేడియేషన్‌కు ఎక్కువగా గురికావడం వల్ల
- పీరియడ్స్ నిర్ణీత వయస్సు కంటే ముందే రావడం వల్ల
- లేట్ ప్రెగ్నెన్సీ వల్ల
- సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ వల్ల
- మెనోపాజ్ తర్వాత హార్మోన్ థెరపీ తీసుకోవడం వల్ల
ఎవరికి ప్రమాదం ఎక్కువ..
- ఇప్పటికే టైప్-1 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు,
- 50 లేదా అంతకంటే ఎక్కువ వయసు వారు,
- ఎక్కువ కాలం పాటు తల్లిపాలను తీసుకోని వారు,
- రొమ్ము పెద్దగా ఉండేవారు,
ఏ పరీక్షల్లో తెలుస్తుంది..
- రొమ్ము సెల్ఫ్ ఎగ్జామినేషన్
- మామోగ్రఫి
- ఆల్ట్రాసౌండ్
- బయాప్సీ టెస్ట్
- చికిత్స ఇలా ఉంటుంది..
- సర్జీరీ కింద లంపెక్టమీ, మాస్టెక్టమీ
- రేడియేషన్ థెరపీ
- కెమోథెరపీ
ఇలా జాగ్రత్తపడాలి..
- కుటుంబ చరిత్రలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్లయితే పరీక్షలు చేయించుకోవాలి.
- పెరుగుతున్న ఊబకాయాన్ని నియంత్రించుకోవాలి.
- శరీరం బరువు పెరిగే ఆహారాలను దూరం పెట్టాలి.
- వైద్యుల సూచన మేరకు గర్భనిరోధక మాత్రలు వాడాలి.
- గర్భనిరోధక మాత్రలకు బదులుగా కండోమ్స్ వాడండి.
- ఆల్కహాల్ డ్రింకింగ్ అలవాటు పూర్తిగా మానుకోవాలి.
- జంక్ ఫుడ్ తినకూడదు.
- ఎక్కువ నీరు తాగుతుండాలి.
- శరీరంలో ఏదైనా గడ్డ కనిపిస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.




