HEALTH MANTRAH

గుండె నొప్పికి అర్జున అభయం | Arjuna Remedy for heartache

AYUSH MANTRAH
0
Also Read

గుండె నొప్పికి అర్జున అభయం | Terminalia Arjuna for heartache for heartache
Terminalia Arjuna

గుండె నొప్పికి అర్జున మూలిక 

రక్త నాళాల్లో కొవ్వు నిలువ ఉంటుంది. ఈ కొవ్వు ఎక్కువై, రక్త ప్రసరణకు అడ్డంకిగా మారినప్పుడే ప్రమాదం. కార్డియాక్ అరెస్ట్ అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వేల ప్రకారం గుండె జబ్బులతో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశం మనదే. ఎలాంటి సూచనలు లేకుండా ఈమధ్య యువకులలో కూడా గుండె జబ్బులు వస్తున్నాయి.

ఆయుర్వేదం :

  • గుండె చాలాకాలం పాటు ఆరోగ్యంగా పనిచేయాలంటే. గుండె కండరాలకు తగినంత బలం చక్కని రక్తప్రసరణ ఉండాలి. 
  • గుండె బలాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం అర్జున. అర్జున తెలుగులో తెల్లమద్దిగా పిలవబడే ఈ వృక్షం రాజo, గుండెను కాపాడడంలో రారాజు.
  • ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చెట్టు చెక్క గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.
  • ఆయుర్వేదంలో గుండె జబ్బులకు వాడే ప్రతి మందులో అర్జున తప్పనిసరిగా ఉంటుంది.
  • వేల ఏండ్ల కిందటే ఈ చెట్టు గొప్పదనాన్ని గుర్తించిన మన పూర్వీకులు అత్యంత పవిత్రమైన వినాయక పూజలో 19వ పత్రగా స్థానాన్ని ఇచ్చారు.
  • 80 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ చెట్టు ఎక్కువగా హిమాలయ దక్కన్ పీఠభూమిలో పెరుగుతుంది.
  • ఔషధంగా ఉపయోగించేది చెట్టు బెరడునే మార్చ్, ఏప్రిల్ నెలలో ఈ చెట్టు బెరడు తీసేందుకు అనువైన కాలం. 
  • గుండె జబ్బుల భయo లేకుండా ముందు జాగ్రత్తగా కూడా ఇది అందరూ తీసుకోవచ్చు.

వాడే విధానం:-

చూర్ణము రుచిగా ఉంటుంది రక్తపోటు,క్రొవ్వు,  గుండె సమస్యలు,  గుండె నాళాలు మూసుకుపోయి ఉన్నవాళ్లు అరలోటా గోరువెచ్చని నీళ్లల్లో ఒక చెంచా వేసుకొని రెండు పూటలు తిన్న తర్వాత తాగితే చాలు. మంచి ఆహారం శరీరానికి అనువైన కొద్దిపాటి వ్యాయామం సంవత్సరంలో ఒక మూడు నెలలు పాటు అర్జున్ చూర్ణంతో కచ్చితంగా గుండె ఆరోగ్యంగా పనిచేస్తుందని గమనించండి

గమనిక:
పై నుదహరించిన ఆరోగ్య సూత్రాలు మరియు చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top