HEALTH MANTRAH

Aatma Thatwam | ఆత్మతత్త్వం

AYUSH MANTRAH
0
Also Read

Aatma Thatwam | ఆత్మతత్త్వం
Aatma Thatwam | ఆత్మతత్త్వం

మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం.. ఈ నాలుగింటినీ అంతరింద్రియాలంటారు. ఈ నాల్గింటి నిగ్రహాన్నే 'శమము' అంటారు. ఆలోచనల ప్రవాహమే మనసు. మనసులో పుట్టిన ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే నిశ్చయాత్మకమైన బుద్ధి సహకరించాలి. సాధకుడు బుద్ధికుశలతతో చిత్తచాపల్యాన్ని అరికట్టి.. అహంకారాన్ని వదిలి, అవాంఛిత కోర్కెలకు కళ్లెం వేసి అంతరింద్రియాలను కైవసం చేసుకోవడమే శమము. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాదులను గ్రహించడానికి ఉపయోగపడే కన్ను, ముక్కు, చర్మం, నాలుక వంటి బాహ్యేంద్రియాలను నిగ్రహించుకొని వ్యవహరించడాన్నే 'దమము' అంటారు. ఈ శమ, దమాలు రెండూ సాధకునికి పరస్పర అనుకూల్యములు. మనసు ప్రవాహమైతే ఆ ప్రవాహాన్ని అదుపులో పెట్టడమే మనోనిగ్రహం.

Aatma Thatwam | ఆత్మతత్త్వం, కర్మేంద్రియాలు
కర్మేంద్రియాలు

కర్మేంద్రియాలైన చేతులతో మనం తినే ఆహారంతో వృద్ధి చెందేది, వివిధ కర్మలకు ఆశ్రయమై పాపాలను ఆపాదింపజేసేది.. స్థూలశరీరం. ఇంద్రియ గోచరం కాని మనసు, బుద్ధి, ప్రాణాదులతో కూడి ఉండేది... మన కోరికలన్నింటినీ తీర్చుకొమ్మని ప్రోత్సహించేది సూక్ష్మశరీరం. 

ఆత్మజ్ఞానుల సాధనలో ఇవన్నీ ముఖ్యమైనవే. శమదమాది మనోనిగ్రహంతోనే వారు ఏకాగ్రత సాధిస్తారు. ఆ ఏకాగ్రతతో ప్రాణాయామం చేసి.. స్థూల, సూక్ష్మ శరీరాలను యోగానికి అనుకూలంగా మలచుకొని సాధనకు ఉపక్రమిస్తారు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు వేరైనదై, పంచకోశాలకు అతీతమైనదై, జాగ్రత్‌, స్వప్న, సుషుప్త అనే త్రిగుణావస్థలకు సాక్షీభూతమైన సచ్చిదానంద స్వరూపమే 'ఆత్మ'. ప్రాణమున్నంతవరకూ శరీరంలో ఉండి.. ప్రాణంతోపాటే శరీరాన్ని విడిచిపెడుతుంది. ఈ 'జీవి'తనకు జన్మతః ప్రాప్తించిన ఇంద్రియాలను.. తన కోరికలను తీర్చుకోవడానికి వినియోగించుకుంటుంది. ఎందుకంటే ఇంద్రియాలు జడపదార్థాలు. ఆత్మ ఒక్కటే చేతనత్వం కలదై ఉంటుంది. ఫలితంగా ఇంద్రియాలు కోరే ప్రతి పనికీ 'జీవి' తన ఆత్మ ప్రతిపాదితమైన శక్తిని ఉపయోగించుకుంటుంది. జీవి కోర్కెల మేరకు ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి దోహదపడుతుందే కానీ.. ఆ పాపపుణ్యాలతో ఆత్మ తనకేమీ సంబంధం లేనిదై ఉంటుంది. జన్మలోనో, జన్మాంతరంలోనో కర్తృత్వ, భోక్తృత్వాలను 'జీవి'యే అనుభవించాల్సి ఉంటుందనే ధోరణితోనే ఆత్మ వ్యవహరిస్తుంది.  

- వెల్లాల వెంకటేశ్వరాచారి,

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top