భోజనం తరువాత చేయకూడని ఆరు ముఖ్యమైన పనులు
- పొగ త్రాగవద్దు: ధూమపానము చేయరాదు. భోజనము చేసినతరువాత ఒక సిగరెట్ కాల్చితే పది సిగరెట్లుకు సమానము అని చెబుతున్నారు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట.
- పండ్లు తినవద్దు: పళ్ళు తినకూడదు. భోజనము చేసిన తరువాత పళ్ళు తినడం వలన కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది.
- టీ తాగవద్దు: టీ తాగకూడదు. టీవలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది.
- మీ బెల్ట్ విప్పకండి: బెల్టు లూస్ చేయకూడదు(పెట్టుకునే వారు) దీనివల లోపల ఎక్కడన్నా ఇరుక్కున్న ఆహరం సరిగ్గా జీర్ణం కాదు.
- స్నానం చేయవద్దు: స్నానం చేయకూడదు. భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.
- నిద్రపోకండి: నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ & ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు కంటే ఎక్కువగా పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు డాక్టర్లు.



