HEALTH MANTRAH

పొట్టతగ్గించే ఆహార నియమాలు - Diet rules for reducing belly fat

AYUSH MANTRAH
0
Also Read

పొట్టతగ్గించే ఆహార నియమాలు - Diet rules for reducing belly fat


మనం తీసు కొనే వివిధ రకాలైనటువంటి సమతుల్య ఆహారం అందరికీ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అంది స్తుంది. అయితే కొన్నిసార్లు మనం తీసుకొనే ఆరోగ్య కరమైన ఆహారాలు లింగ భేదం (ఆడ,మగ)పై ఆధార పడి ఉంటాయి. 
   కొన్ని ఆహార పదార్థాలు మహిళ లకు, పురుషులకు అని  తేడా లేకుండా తింటుంటారు. అయితే డైట్‌ విషయంలో మహిళలు ఒక రకమైన ఫుడ్‌ను తీసుకొంటే పురుషులకు మరో రకమైన ఆహారాలు ఉన్నాయి. అది వారి వారి ఆరోగ్యాలపై ప్రభావాన్ని చూపెడుతాయి. కాబట్టి పురుషులు తమ బరువును తగ్గించుకొనే క్రమంలో కొన్ని డైట్‌ విషయాలను పాటించినట్లైతే అతి త్వరగా బరువును తగ్గించుకోవచ్చు.

గుండెకు సంబంధించి ఆరోగ్యకరమైన ఆహారం : సాధారణంగా గుండె జబ్బుల బారిన అధికంగా పడుతున్నది పురుషులు. అది కూడా వివిధ రకాలుగా సంభవించవచ్చు. మగవారి రక్త ప్రవాహంలో హానికరమైన కొవ్వులు మరింత పేరుకుపోవడం చేత ఇలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి లో కొలెస్ట్రాల్‌ ఉన్న ఆహారం తీసుకోవడం పురుషులకు ఆరోగ్యకరం. కొవ్వులేని మాంసం, పచ్చసొనలేని గుడ్డు, లోఫ్యాట్‌ డెయిరీ ప్రొడక్ట్స్‌ వంటివి పురుషుల యొక్క డైట్‌లో ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు గ్రీన్‌ లీఫీ వెజిటబుల్స్‌, హెల్తీ ఆయిల్స్‌, ఆలివ్‌ ఆయిల్‌ను వంటల్లో ఉపయోగించడం వల్ల గుండెకు ఆరోగ్యకరం. చేపల్లో మంచి కొలెస్ట్రాల్‌ ఉండడం వల్ల పురుషుడు తీసుకొనే ఆహారంలో చేపలను చేర్చడం ఎంతో ఆరోగ్యకరం.

హై ప్రోటీస్‌ డైట్‌ : స్త్రీతో పోల్చుకుంటే పురుషులు అధిక ప్రోటీనులు కలిగిన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.ప్రోటీనులు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల పురుషులు తమ బరువును అతి సులభంగా, అతి త్వరగా తగ్గించుకోవచ్చు. పిండి పదార్థాలను సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవాలి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్‌ అధికంగా ఉన్న బియ్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి మాంసాహార, శాకాహార ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి.

పాలియో డైట్‌ : పాలియోథిక్‌ డైయట్‌లో ముఖ్యంగా పండ్లు, వెజిటేబుల్స్‌, మాంసం, చేపలు, గుడ్లును తీసుకోవాలి. పంచదార ఉప్పు, చీజ్‌, బ్రెడ్‌ వంటివి తగ్గించాలి. ఈ డైట్‌ పురుషులకు చాలా ఆరోగ్యకరం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి.

యాబ్స్‌ డైట్‌ : పురుషులు చాలా వరకు బెల్లీఫ్యాట్‌ను ఇష్టపడరు. వారి పొట్ట ఎప్పుడూ సాదాగా ఉండాలని జాగ్రత్తలు తీసుకొన్న ఒకానొక సందర్భంలో ఈ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వారు యాబ్స్‌ డైట్‌ తప్పనిసరిగా పాటిస్తే బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకోవచ్చు. ఇది ముఖ్యంగా జీరో కార్బోహైడ్రేట్స్‌ డైట్‌. ఇందులో ఎక్కువగా పండ్లు, కూరగాయలు. ఎక్కువగా నీళ్లు తాగాలి. ఇవి పాటిస్తే తప్పనిసరిగా బరువు తగ్గి బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకోవచ్చు.

జోస్‌ డైట్‌ : ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి డైట్‌. శరీరంలోని జీవక్రియ సక్రమంగా జరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ డైట్‌ వల్ల పురుషులకు ముప్పైశాతం ప్రొటీన్స్‌, ముప్పైశాతం ఫ్యాట్స్‌, మరియు నలభైశాతం కార్బోహైడ్రేట్స్‌ అంధించి జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వును కరిగించడానికి బాగా సహకరిస్తుంది.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top