HEALTH MANTRAH

సుఖ సంసారం: Failure in sex, Solution - రతిలో వైఫల్యం

AYUSH MANTRAH
0
Also Read

సుఖ సంసారం: Failure in sex, Solution - రతిలో వైఫల్యం
Failure in sex
Failure in sex - రతిలో వైఫల్యం
 
ప్రశ్న : నాకు పెళ్లయి రెండేళ్లయ్యింది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తు న్నాం. గర్భం దాల్చాలంటే నిర్దిష్టమయిన రోజుల్లోనే సెక్స్ చేయాలని మా ఆవిడ ఎక్కడో చదివింది. ఆ ప్రకారంగా ఆయా రోజుల్లో సెక్స్ చేయడానికి ప్రయత్నించినపుడు నేను సరిగ్గా చేయలేకపోయాను. రతిలో వైఫల్యం కారణంగా నా కు మనశ్శాంతి లేకుండా పోయింది. నేను సెక్స్‌కు పనికి రానేమోనన్న భయం ఏర్పడింది. ఈ విషయం ధ్రువీకరిం చుకోడానికి నేను బయట ఒక వేశ్యతో కలిసాను. ఫలి తంగా నాకు గనేరియా సోకింది. డాక్టర్ గారు నాకు మం దులిచ్చి రెండు నెలలు పాటు వాడమని చెప్పారు. అంతే కా కుండా, మందులు వాడుతున్న రోజుల్లో, భార్యతో సెక్స్ చే యవద్దని సూచించారు. అందువల్ల ఆమెకు కూడా వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉందని చెప్పారు. ఇదంతా నేను నా భార్యకు చెపకోలేని పరిస్థితి. పిల్లలు కావాలనుకుంటు న్నప్పట్నుంచి, నేను సెక్స్ పట్ల సరిగ్గా ప్రవర్తించలేకపోవడం వల్ల ఆమె నన్ను అపార్ధం చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి?

జవాబు : కొంతమందిలో తప్పనిసరిగా సెక్స్ చేయాలనే నిబంధన ఉన్నపుడు సహజంగా రతిలో వైఫల్యం చెందడం జరుగు తుంది. ఈ కారణంగా సెక్స్‌కు పనికిరాననే అభిప్రాయానికి రావడం మీరు చేసిన మొదటి తప్పయితే, ఆ విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి మీరంతట మీరే ప్రయత్నించడం, వేశ్య దగ్గరకు వెళ్లడం మరో తప్పు! ప్రస్తుతం ఇదంతా మీ భార్యకు చెప్పకపోవడం మీరు చేస్తున్న మూడో తప్పు. మీ భార్య మిమ్మల్ని అర్ధం చేసుకోదేమోనన్న భయం మీకు ఉం డడం నిజమే కానీ అందువల్ల మీ ఇద్దరి మధ్య అన్యోన్యత దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నపుడు, మీరు తాత్సారం చేయడం మంచిది కాదు. మీ భార్యకు వెంటనే జరిగిందంతా చెప్పండి. మీరిలా ఎందుకు చేయాల్సివచ్చిందో ఆమెకు వివ రించండి. కావాలని మీరు చేసిన తప కాదు కాబట్టి ఆమె అర్థం చేసుకుంటుంది. అయినా సరే మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోదేమోనన్న అనుమానం ఉంటే, మీ దగ్గర్లో వున్న సెక్స్ కౌన్సిలర్‌ను కలవండి.


గమనిక:
పై నుదహరించిన ఆరోగ్య సూత్రాలు మరియు చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top