 |
| chickpeas |
శనగలతో ఏమేమి చేసుకోవచ్చు? ఎన్ని రకాలుగా తినవచ్చు? వాటి వలన లాభాలు ఎన్ని?
 |
| వేరుశనగ |
శనగలు అంటే వేరుశనగలు వీటిని మనం పల్లిశనగలు అంటారు. అదేవిధంగా ఈ ఫోటోలో చూపిన వాటిని మా ఇండ్లలో మంచి శనగలు అంటాము. వేరుశనగలు మొక్కకు భూమి లోపల ఉంటాయి వేళ్ళతో ఉంటాయి .
మంచి శెనగలు శెనగ చెట్టుకు పైన కాస్తాయి. ఈ మంచి శనగలు ఏ రకంగా తినవచ్చు వీటి వల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…. |
| శెనగలు - chanadal |
శనగలు నీరు తక్కువ లభించే పొలాల్లో అక్టోబర్, నవంబర్ మాసాలలో ఈ పంటను వేసేవారు.. అప్పట్లో వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియదు కేవలం అమ్మితే డబ్బులు వస్తాయి అని మాత్రమే తెలుసు!?
- శనగలను నానబెట్టి పొద్దున్నే అల్పాహారంగా లాగా తిరవచ్చు.
- చనగలను వేయించి ఉప్పు చల్లి ఉప్పు శనగలుగా తినవచ్చు.
- చనగలను వేయించి దంచి సెనగపప్పు కూర లాగా తినవచ్చు.
- శనగపప్పును తాలింపులను ఉపయోగించవచ్చు.
- శనగలను కూర చేసుకొని కూడా తినవచ్చును. నేరుగా పడిన కూర చపాతీలోకి బాగుంటుంది.
- శనగలతో వడలు కూడా చేస్తారు.
- శనగలను నానబెట్టి తర్వాత ఉడకబెట్టి తాలింపు వేసుకొని మసాలా సెనగలుగా తినవచ్చు
- కొన్నిసార్లు సెనగలను నెయ్యిలో వేయించి ఇంకా ఇతర పదార్థాలు కలపడం వల్ల ప్రసాదము లాగా చేసి దేవునికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు.
- శనగపప్పు పచ్చిపప్పు అని పుట్నాల పప్పు అని రెండు విధాలుగా చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో బాగా జలుబు చేసి ముక్కు దిబ్బడ వేస్తే పుట్నాల పప్పులు గుప్పెడు తీసుకొని తినమని మా అమ్మ చెప్పేది ముక్కుపుటలు శుభ్రం అయ్యేవి.
- కొంతమంది ఉదయం అల్పాహారంలో మొలకెత్తి విత్తనాలు తింటారు అందులో వేరుసెనగలు కూడా ఒక రకమైన విత్తనంగా కలిపి తింటారు.
శనగలను క్రమంతప్పకుండా తినటం వల్ల కలిగే లాభాలు
- అధికరక్తపోటు - (హై బీపీ( ఉన్నవారికి ఇది మంచి ఆహారంగా చెబుతారు. (నిజా నిజాలు ఐబీపీ ఉండి ఈ పదార్థం తిన్నవారు చెప్తేనే న్యాయంగా ఉంటుంది),
- ఈ సెనగలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని దీనివల్ల మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచిదని పెద్దలు సూచించడం విన్నాను.
- వీటిల్లో కాల్షియం, ఇనుము అధికంగా ఉంటుందని…. ఎదిగే పిల్లలకు ఎముకలలో గట్టితనం రావడానికి అదే విధంగా హీమోగ్లోబిన్ శాతం పెరగడానికి మంచిదని తెలుస్తుంది.
- జీర్ణ క్రియను మెరుగుపరిచి తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడం సహాయం చేస్తుందని..
- రోజు ఒక పిడికెడు శనగలు తింటే గుండె జబ్బులు తక్కువ వస్తాయని అనుకుంటారు.
- 50 గ్రాముల శనగలు సాయంత్ర సమయంలో నీళ్లలో నానవేసి ఉదయం వడకట్టిన నీళ్లలో కొంచం పంచదార కలిపి పిచ్చి వ్యాధి గలవారి కి తాగించుచున్న యెడల 40 రోజుల్లో ఉన్మాద వ్యాధి హరించును . ఉన్మాదవ్యాధి అనగా పిచ్చి పట్టడం.
- శాఖాహారులకు కావలసిన అనేక పోషక విలువలు సెనగల రూపంలో అందుతాయి.