HEALTH MANTRAH

జలుబు | ఆయుర్వేద గృహ వైద్యం | Cold, Cough | Ayurvedic Home Medicine

AYUSH MANTRAH
0
Also Read

జలుబు | ఆయుర్వేద గృహ వైద్యం | Cold, Cough | Ayurvedic Home Medicine
Cold, Cough

జలుబు 

వైరస్‌ అనే సూక్ష్మక్రిముల వల్ల జలుబు ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ముక్కు నుంచి కారే స్రావంలోను, దగ్గటం, తుమ్మటం, కళ్ళి ఉమ్మేయటం వల్ల బయల్వెడలే గాలి, నీటి తుంపర్లలో ఈ వైరస్‌లు వుంటాయి.

జలుబు లక్షణాలు :

ముక్కు వెంట నీరు కారటం, తలనొప్పి, తలదిమ్ము, నలత, గొంతు నొప్పి, పొడి దగ్గు, వళ్ళు వేడిగా జ్వరమొచ్చినట్లుండటం, ఆకలి తగ్గటం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు ౩ - 7 రోజుల వరకు వుంటాయి.

ఆయుర్వేద గృహ వైద్యం

  • ముక్కు దిబ్బడ ఎక్కువగా వున్న సందర్భాల్లో నీటి ఆవిరి కొద్దిసేపు పీలిస్తే అది తొలగిపోయి ముక్కు ద్వారా శ్వాస బాగా ఆడుతుంది. 
  • ఉదయం, సాయంత్రం పూటకు 5 మి.లీ. అల్లం రసంలో 5. మి.లీ తేనె కలిపి త్రాగాలి. 
  • శుంఠి పొడి, మిరియాల పొడి సమానంగా కలిపి వుంచుకొని 100 మిలీ. నీరు మరిగేటప్పుడు 2 - 3 గ్రాముల ఈ చూర్తాన్ని వేసి మరింతసేపు మరిగించి దించి 5 గ్రాముల బెల్లం పొడి కలిపి కరిగించి గోరు వెచ్చగా వున్నపుడు వడగట్టి త్రాగాలి, రోజూ రెండు పూటలా ఈ విధంగా చెయ్యాలి.
  • రోజూ 2 పూటలా పూటకు ఆరు తులశాకులు, రెండు మిరియాలు, ఒక అవంగం కలిపి నమిలి మింగుతుండాలి.
  • 5,6 గులాబీ పూలను తీసుకుని వాటి రేకులను 50 గ్రా. నువ్వుల నూనెలో వేసి నల్లబడేంతవరకు సన్న మంటపై కాచి దించి చల్లార్చి వడగట్టి రోజూ 2 పూటలా పూటకు 2-4 చుక్కలు ఒక్కో ముక్కు రంధ్రంలో వేస్తుండాలి. వేసవి.కాలంలో అలర్జీ సమస్య వున్నవారికి ఈ ఔషధం మంచి ఫలితాలనిస్తుంది.
  • 250మి.లీ.తులసి రసంలో 50 గ్రా. పటిక బెల్లం పొడి కలిపి కరిగించి పొయ్యిపై పెట్టి సన్న మంటపై మరిగిస్తూ తీగపాకం వచ్చిన పిదప దించి చల్లార్చి ఉదయం, సాయంత్రం పూటకు 5 - 10మి.లీ చొప్పున సేవించాలి. సాధారణ అలర్జీతో పాటు మానసిక వత్తిళ్ళు ఎక్కువైనపుడు తీవ్రమయ్యే అలర్జీ కూడా ఈ బెషధసేవన వల్ల త్వరగా తగ్గుతుంది.
  • గులాబీ పూలరసం, నువ్వుల నూనె సమానంగా కలిపి సన్నమంటపై రసమంతా ఇగిరిపోయి నూనె మాత్రం మిగిలేట్లు కాచి దించి చల్లార్చి వడగట్టి రోజూ 2 సార్లు పూటకు 2 - 4 చుక్కలు ఒక్కో ముక్కు రంధ్రంలో వేస్తుండాలి. వేసవి కాలంలో అలర్జీ సమస్య ఎక్కువగా వేధించే వారికి ఈ బెషధం సత్వర ఫలితాలనిస్తుంది.
  • రోజూ పరగడుపున ఒక్కో ముక్కు రంధ్రంలో రెండు చుక్కల వేప నూనెను వేస్తుంటే అలర్జీ వల్ల ముక్కుల్లో పెరిగిన కండలు (పాలిప్స్‌) కరిగిపోతాయి.
  • 2,3 రోజుల పాటు రోజూ ఉదయం నాలుగైదు చుక్కల ఉల్లి రసాన్ని ఒక్కో ముక్కు రంధ్రంలో పిండాలి.

ఆయుర్వేదం

  • త్రికటు చూర్ణం:- రెండు పూటలా పూటకు ఒకటైెండు గ్రాముల చూర్ణాన్ని 2 - 5మి.లీ - 5 మి.లీ తేనెతో..
  • ప్రవాళ పంచామృతం:- రెండు పూటలా పూటకు 125 - 250 మి.గ్రా చొప్పున 2.5 మి.లీ తేనెతో..
  • హరిద్రాఖండ:- రెండు పూటలా 2.5 గ్రా పొడిని 50 మి.లీ నీటిలో కలిపి
  • సదర్శన ఘనవటి:- మూడు పూటలా ఆహారం తర్వాత పూటకు10 - 20 మిలీ. ఔషధాన్ని సమానంగా అమృతారిష్ట కలిపి రెట్టింపు నీరు కలిపి సేవించాలి.
  • దశమూలారిష్ష:- రెండు పూటలా ఆహారం తర్వాత పూటకు 10 - 20మి.లీ. బెషధాన్ని రెట్టింపు నీరు కలిపి సేవించాలి.
  • చ్యవన ప్రాశ;- రెండు పూటలా పూటకు 5 -1 0 గ్రా. చప్పరించి మింగి 50 మిలీ. పొలలో 5 గ్రా. పటిక బెల్లం పొడి కలిపి త్రాగాలి. (లేదా) 200 గ్రా. చ్యవన ప్రాశలో 1) గ్రా. ప్రవాళ పంచామృత భస్మం కలిపి పూటకు 5 గ్రా. చొప్పున రెండు పూటలా సీవించాలి.
  • అణుతైలం:- రెండు పూటలా పూటకు 2,3 చుక్కల వంతున ఒక్కో నాసికారంధ్రంలో వేస్తుండాలి.
జాగ్రత్తలు:- ఏ కారణం వల్ల ఈ సమస్య వస్తూ వుందో గమనించి దానికి దూరంగా పండటం ఎంతో ముఖ్యం. దీనినే ఆయుర్వేద వైద్యంలో నిదాన పరివర్దనం అనే ప్రక్రియగా వ్యవహరిస్తారు. ఇచట నిదానము అంటే వ్యాధి సంభవించే కారణమని, పరివర్జనం అంటే ఆకారణానికి దూరంగా వుండటమని అర్ధం.

Dr. Chittibhotla Madhusudana Sharma, 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top