HEALTH MANTRAH

శృంగారం - కామసూత్ర | Romance - Kaamasutra

AYUSH MANTRAH
0
Also Read

శృంగారం - కామసూత్ర | Romance - Kaamasutra
Kaamasutra

శృంగారం - కామసూత్ర

వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంధము మానవుల (సంభోగం) గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగవాత్సాయనుడు రచించాడని భావిస్తారు. గ్రంథంలోని కొంతభాగం మానవ లైంగిక ప్రవర్తన గురించి చెప్పబడింది.

సాధారణంగా కామశాస్త్రమనే గ్రంథాల సమహారంలో కామసూత్ర అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథం. చరిత్రకారుడు జాన్ కీయే కామసూత్ర ఒక సంకలనమని, ఇది ప్రస్థుతమున్న స్థితిలో క్రీ.శ. రెండవ శతాబ్దములో సేకరించబడినదని చెప్పాడు.

విషయ సంగ్రహం

వాత్సాయనుని కామసూత్రాలు 36 విభాగాలు, 7 భాగాలుగా వ్రాయబడ్డాయి. బర్టన్, డోనిగర్ వంటి అనువాదకులు కూడా ఇదే మూలపద్ధతిని అనుసరించారు:

1. పరిచయం (సంసాధారణం)

మొదటి విభాగంలో పుస్తక విషయము,అమరిక గురించి క్లుప్తంగా వివరించబడింది. పరిచయభాగములోని ఇత రవిభాగాలు జీవిత గమ్యాలు ప్రాముఖ్యత, విజ్ఞాన సముపార్జన, సజ్జనులు,ఉన్నత కుటుంబాలనుండి వచ్చిన నాగరీకుల నడవడిక, విటునికి సహాయపడే మధ్యవర్తుల గురించిన విషయాలను చర్చించబడ్డాయి (5విభాగాలు).

2. శృంగార కలయిక : 

సంప్రయోగికం నామ ద్వితీయ అధికరణం ) - విభాగాలు కామోద్దీపనం,ఆలింగనాలలో రకాలు, caressing మరియు ముద్దులు, నఖక్షతాలు, దంతక్షతాలు, రతి భంగిమలు, తాడనాలు, అనుబంధిత శీత్కారాలు, virilebehavior in women, ఉపరతి మరియు ముఖ రతి, రతికేళి యొక్క అంత్యారంభాల గురించి వివరిస్తాడు. దీనిలో 64 రకాల కామ క్రీడలు వివరించాడు (10 విభాగాలు).కామసూత్రములో వివరించబడిన ఒక రతి భంగిమకు చిత్రరూపము.కామసూత్ర రెండవ భాగములో వివిధ రతిభంగిమలు వివరించబడినవి కానీ ఎటువంటి రేఖాచిత్రాలు లేవు.

3. భార్యను పొందే విధానం

కన్యా సంప్రయుక్తకం) - విభాగాలు వివాహంలో రకాలు, relaxing the girl,obtaining the girl, managing alone, వైవాహిక సంగమం (5విభాగాలు).

4. భార్యాధికరణం

భార్యాధికారికం): ఒక్కతే భార్య మరియు ముఖ్యమైన ఇతర భార్యలప్రవర్తన (2 విభాగాలు).

5. ఇతరుల భార్యల గురించి

ఈ విభాగాలలో స్త్రీ, పురుషుల ప్రవర్తన, పరిచయం పెంచుకోవటానికి మార్గాలు మరియు పద్ధతులు, examination of sentiments, రాయబారాలు నెరపే విధానం, రాజభోగాలు, గర్భాశయము యొక్క నడత(6 విభాగాలు).

6. వేశ్యాధికరణం

ఈ విభాగం విఠుల ఎంపిక, స్థిరమైన విఠుని కొరకు వెతకటం, డబ్బు చేసుకోవటానికి మార్గాలు, పాత ప్రేమికునితో తిరిగి స్నేహం చిగురింపజేయటం, అనుకోకుండా కలిగే లాభాలు, లాభనష్టాలు మొదలైనవాటిపై వేశ్యలకు సూచనలు ఇస్తున్నది (6 విభాగాలు).

7. ఇతరులను ఆకర్షించడం గురించి

(సం ఔపనిషాధికం): ఈ భాగంలో శారీరక ఆకర్షణను మెరుగుపరచుకోవటం,వశీకరణం, లైంగిక బలహీనతలను అధిగమించడం వంటి విషయాలు చర్చించాడు (2 విభాగాలు).

ఆనందం మరియు ఆధ్యాత్మికత

భారతీయ సాంప్రదాయం ప్రకారం మానవులకు పురుషార్ధాలనే నాలుగు ప్రాధమిక ధర్మాలున్నాయి, ఇవే పురుషార్ధాలు:
  • ధర్మ: Virtuous living.
  • అర్థ: Material prosperity.
  • కామ: Aesthetic and erotic pleasure.
  • మోక్ష: Liberation.
జీవన్మరణ చక్రం నుంచి విముక్తినే మోక్షమంటారు. జీవన్మరణ చక్రం నుంచివిముక్తిని కోరుకొనే వారు మోక్షమే ప్రధాన పురుషార్థంగా భావిస్తే, ధర్మార్థకామాలు జననానికి మరణానికి మధ్య జరిగే నిత్య జీవితపు పురుషార్థాలు. 

కామసూత్రం (బర్టన్ అనువాదం) లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:

కామానికంటే అర్థము, అర్థానికంటే ధర్మము ఉన్నతమయిన జీవితలక్ష్యాలు. కానీ, ప్రజల నిత్యజీవిత అవసరాలను తీర్చే శక్తి అర్థానికే ఉంది కనుక, దేశాలను పరిపాలించే రాజులు మాత్రం అర్థాన్నే ప్రధాన పురుషార్థంగా స్వీకరించాలి. పడుపు వృత్తియే జీవనాధారముగా కల స్త్రీలకు కామమే ప్రధాన పురుషార్థము. వీరిరువురి విషయంలొ పయిన చెప్పిన నియమము వర్తించదు.

మానవ జీవితంలొ అన్నిటికంటే ఉన్నతమయిన లక్ష్యం “ధర్మం“. తరువాత భద్రత (ఆర్థిక మరియు సామాజిక) నిండిన జీవితం ఆశయకరం. సుఖభరితమయిన జీవితము అన్నిటికంటే చివర కోరదగినది. జీవితలక్ష్యాల గురించి సంశయము కలిగినప్పుడు, తికమక కలిగినప్పుడు, అధమ లక్ష్యాలను త్యజించి ఉన్నతలక్ష్యాలను ఎంచుకోవాలి. అర్థసాధనకయి  ధర్మాన్ని, కామసాధనకయి అర్థసాధనను, త్యజించరాదు. అయితే, ఈ నియమానికి కోన్ని ఆక్షేపాలు (exceptions) ఉన్నాయి.

వాత్సాయనుని ప్రకారం, అర్థసాధనకు కావలసిన విద్యను బాల్యంలోనే అభ్యసించాలి. యవ్వనదశ కామసాధనకు అనువుగా ఉంటుంది. వార్ధక్యదశ దగ్గరయ్యేకొద్దీ మానవుడు ధర్మసాధనపై దృష్టిని నిలిపి, మోక్షమునకై ప్రయత్నించాలి.కామసూత్ర గ్రంధాన్ని తాంత్రిక శృంగారానికి సంబంధించిన గ్రంధంగా అనుకోవటం పొరపాటు. హిందూ తంత్రములో శృంగారము ఒక భాగమైనప్పటికీ, తంత్రక్రియకు సంబంధించిన శృంగార కర్మలు కామసూత్ర గ్రంధంలో లేవు.

అనువాదాలు

కామసూత్ర ఆంగ్ల అనువాదాలలో అన్నింటికన్న ప్రసిద్ధిచెందినది ప్రముఖ యాత్రికుడు మరియు రచయిత సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ 1883లోరచించినది. ఇటీవలి కాలంలో, 1980లో ఇంద్రా సిన్హా కామసూత్రను ఆంగ్లంలోకి అనువదించారు. దాదాపు 1990 నుండి కామసూత్రలోని వివిధ రతిభంగిమలు వివరించబడిన అధ్యాయమొక్కటే స్వతంత్ర గ్రంథంగాఇంటర్నెట్లో చెలామణీ కావటం ప్రారంభించింది. ఇవాళ పరిస్థితి, ఆ అధ్యాయమెక్కటే మొత్తం కామసూత్ర అని అనుకునే స్థాయికి చేరుకుంది  అలాయిన్ డానియలౌ 1994లో సంపూర్ణ కామసూత్ర రచించాడు. దీనిలో వాత్సాయనుడు వ్రాసిన మూల గ్రంథానికి ఆధునిక వివరణలు ఉన్నాయి.

అన్నింటికన్నా తాజాగా 2002లో చికాగో విశ్వవిద్యాలయంలోని మత చరిత్ర ఆచార్యురాలు వెండీ డోనిగర్ మరియు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ప్రపంచ మతాల కేంద్రంలోని భారతీయ మానసిక విశ్లేషకుడు సుధీర్ కక్కర్ కలిసి అనేక కోణాల నుండి ఈ గ్రంధాన్ని విశ్లేషించారు..

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top