![]() |
| Banana |
మనం తినే అరటి పండులో సహజ సిద్ధమైన తీపి, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఒకమనిషి గంటన్నరపాటు కష్టపడితే దానికి తగ్గ శక్తిని రెండు అరటి పండ్లు ఇస్తాయి. ఈ అరటి పళ్ళు తినడం వల్ల శక్తి రావడమే కాకుండా రోగాలు రాకుండా చేస్తుంది. ముఖ్యంగా అధిక ఒత్తిడికి లోనైనవారు ఈ పండు తింటే ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీనిలో ఉండే అధికశాతం పొటాషియం వలన రక్తపోటును అదుపులో ఉంచి పక్షవాతం రాకుండా చేస్తుంది.
ఇందులో ఉండే బి6 విటమిన్ రక్తంలోని చక్కెర మోతాదును నియంత్రిస్తుంది. ఎర్ర రక్త కణాలను వృద్ధిచేస్తుంది. దీనిలోని అధిక పీచుపదార్థం వలన మలబద్ధకం రాకుండా చేస్తుంది. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో తినటం వలన మెదడుకు చురుకుదనం పెరుగుతుంది. విద్యార్ధులకు గ్రహణశక్తిని పెంచుతుంది. చాతిలో మంటను తగ్గిస్తుంది. వేవిళ్ళతో బాధపడే మహిళలు వీటిని తింటే చాలా ఉపశమనం కలుగుతుంది. దోమ కాటు వలన వచ్చే వాపు, మంటకు అరటి పండు తొక్క లోపలి భాగంతో రుద్దితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. చిప్స్, చాక్లెట్స్ తినడం మాని అరటిపండు తినటం వలన ఊబకాయాన్ని తగ్గిస్తుంది. కడుపులోని పుండ్లను తగ్గిస్తుంది. ఈపండుని క్రమంతప్పకుండా తినడం వలన పక్షవాతం రాకుండా చేస్తుంది. ఆపిల్ తో పోలిస్తే 4 రెట్లు మాంసకృత్తులు, 2 రెట్లు పిండి పదార్థాలు, 3 రెట్లు భాస్వరం, 5 రెట్లు విటమిన్ A కలిగి ఉంది.
బూట్లను అరటి పండు తొక్కతో రుద్ది పాలీష్ చేస్తే మెరిసిపోతాయి. అరటిపండును ఉదయం తినటం వలన రాగి వలె, మధ్యాహ్నం తినటం వలన వెండి వలె, రాత్రి తినడం వలన బంగారం లాగా పని చేస్తుంది.
గమనిక:
పై నుదహరించిన ఆరోగ్య సూత్రాలు మరియు చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి
పై నుదహరించిన ఆరోగ్య సూత్రాలు మరియు చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి



